నేర పరిశోధనకు వైద్య నివేదికలు కీలకం | - | Sakshi
Sakshi News home page

నేర పరిశోధనకు వైద్య నివేదికలు కీలకం

Nov 11 2026 1:07 AM | Updated on Nov 11 2026 1:07 AM

సాక్షి,పాడేరు: నేర పరిశోధనకు వైద్య నివేదికలు ఎంతో కీలకమని కలెక్టర్‌ టి.నిశాంతి అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికో–లీగల్‌ విధానాలపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేరాల దర్యాప్తును సమర్ధవంతంగా నిర్వహించడం, శాసీ్త్రయ ఆధారాల సేకరణ, న్యాయపరమైన ప్రక్రియలను వేగవంతం చేయడంలో వైద్య, పోలీసుశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్‌ ఆధారాలు, వైద్యనిపుణుల అభిప్రాయాలు అత్యంత కీలకమన్నారు. వైద్యపరీక్షలు నిర్వహించే సమయంలో కచ్చితత్వం, శాసీ్త్రయ విశ్లేషణ, సరైన నమోదు, పారదర్శకతను తప్పనిసరిగా పాటించాలన్నారు. న్యాయవ్యవస్థకు సహకారం అందించడంలో వైద్యులు పాత్ర ఎంతో ముఖ్యమైనదన్నారు. రెండు రోజుల వర్క్‌షాప్‌లో వైద్యనిపుణులంతా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపోందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బుచ్చిబాబు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ వెంకటేశ్వరరావు, డాక్టర్‌ రాధ, డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఫోరెన్సిక్‌ మెడిషన్‌ విభాగాధిపతి డాక్టర్‌ సుబ్బారావు, ఏఎస్పీ శృతి, వైద్యులు, వైద్య విద్యార్థులు, పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement