జావెలిన్‌ త్రోలో కల్యాణి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జావెలిన్‌ త్రోలో కల్యాణి ప్రతిభ

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

● జాతీయ స్థాయి పోటీలకునుర్మతి ఆశ్రమ విద్యార్థిని

జి.మాడుగుల: మండలంలోని నుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థిని కె.కళ్యాణి ఎస్‌జీఎఫ్‌ ఐ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో జావెలిన్‌ త్రో విభాగంలో ప్రథమ స్థానం సాధించింది. కర్నూలులో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ నెల చివరి వారంలో ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్‌.నాగేశ్వరరావు, పీడీ గిడ్డి మురళి విద్యార్థినిని అభినందించారు. జాతీయస్థాయిలోనూ రాణించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement