మరో ఐదు రోజులు వర్షపు జల్లులు | - | Sakshi
Sakshi News home page

మరో ఐదు రోజులు వర్షపు జల్లులు

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

చింతపల్లి ఏడీఆర్‌ ఆదిలక్ష్మి

చింతపల్లి: జిల్లాలో మరో ఐదు రోజుల పాటు వర్షం పలకరించనుంది. ఇప్పటికే తుఫాన్ల ప్రభావంతో భారీ వర్షాలను చవిచూసిన గిరిజన ప్రాంతంలో రానున్న రోజుల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జిల్లాలోని చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ డి. ఆదిలక్ష్మి శుక్రవారం తెలిపారు.

ఐదు రోజుల వాతావరణ అంచనాలు

ఈ ఐదు రోజుల వ్యవధిలో 0 నుంచి 5 మిల్లీమీటర్ల వరకు తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24.8 నుంచి 25 డిగ్రీల మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 నుంచి 19.3 డిగ్రీల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. ఉదయం వేళల్లో గాలిలో సాపేక్ష ఆర్ద్రత 78 నుంచి 90 శాతం, మధ్యాహ్నం వేళల్లో 85 నుంచి 90 శాతం వరకు ఉండే అవకాశం ఉందన్నారు. గాలులు గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయని వివరించారు. ఆకాశం ఆక్టా 2–3 మేర మేఘావృతమై ఉండవచ్చన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్‌ ఆదిలక్ష్మి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement