ఈ–వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు | - | Sakshi
Sakshi News home page

ఈ–వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

కొయ్యూరు: ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సుధ అన్నారు. శుక్రవారం కళాశాలలో బ్రిక్స్‌ సుస్థిర వారోత్సవాల్లో భాగంగా ఈ–వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలక్ట్రానిక్‌ పరికరాలను అవసరమైనంత వరకు మాత్రమే వినియోగించాలని, వ్యర్థాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటలక్ష్మి వ్యర్థాల పునర్వినియోగ పద్ధతులను వివరించారు. ఫిజిక్స్‌ అధ్యాపకుడు సీహెచ్‌ రాజుబాబు మాట్లాడుతూ పాత మొబైల్‌ ఫోన్లు, టీవీ లు, రిమోట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ బ్యాటరీలను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయని తెలిపారు. బ్రిక్స్‌ ప్రోగ్రాం అధికారి బోండ్ల శేఖర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement