వైఎస్సార్సీపీ హయాంలో బాకై ్సట్ జీవో 97 రద్దు చారిత్రాత్మకం రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలి అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి వారపు సంతల్లో భారీ ప్రచార ర్యాలీ
సాక్షి, పాడేరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల పక్షాన నిలిచిన నాయకుడని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి అన్నారు. బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించిన జీవో నంబర్ 97ను రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. హుకుంపేట జెడ్పీటీసీ అభ్యర్థి ఒంటుబు ప్రియాంకతో పాటు అన్ని ఎంపీటీసీ సెగ్మెంట్ల అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ శనివారం హుకుంపేట వారపు సంతలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. కొంతిలి జంక్షన్ నుంచి ప్రచార ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి జీవో 97 తీసుకువచ్చారని, దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్రెడ్డి గిరిజనుల పక్షాన ఉద్యమాలు చేపట్టారని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి గిరిజనుల ఖనిజ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో రూ.500 కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల మంజూరు చేయడం ద్వారా గిరిజన ప్రాంతంలో వైద్య విద్య, ఉన్నత వైద్య సేవలకు అవకాశం కల్పించామని చెప్పారు.
హుకుంపేటలో హోరెత్తిన ర్యాలీ : వైఎస్సార్సీపీ ప్రచార ర్యాలీతో హుకుంపేట మండల కేంద్రం, వారపు సంత సందడిగా మారాయి. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొంతిలి జంక్షన్ నుంచి ప్రధాన రహదారి మీదుగా వారపు సంత, మోదకొండమ్మ గుడి సెంటర్ మీదుగా తిరిగి కొంతిలి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఓపెన్‌టాప్ వాహనంపై అరకు ఎంపీ తనూజరాణి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే, సీఈసీ సభ్యుడు చెట్టి పాల్గుణ, జెడ్పీటీసీ అభ్యర్థి ఒంటుబు ప్రియాంక, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొని ఓటర్లకు అభివాదం చేశారు. ర్యాలీలో పార్టీ పాటలకు నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ, జై జగన్ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, యువజన విభాగం రాష్ట్ర నేత చెట్టి వినయ్ కూడా నృత్యాలతో సందడి చేశారు. వారపు సంతలో ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు పాంగి అనిల్, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
ముంచంగిపుట్టు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ద్వారా కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి జల్లిపల్లి సుభద్రతో పాటు 14 ఎంపీటీసీ సెగ్మెంట్ల అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ శనివారం మండల కేంద్రంలోని వారపు సంతలో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. దారపల్లి నుంచి ప్రారంభమైన ర్యాలీ పార్టీ జెండాలు, నినాదాలతో ఉత్సాహంగా సాగింది. నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రహదారులు, తాగునీరు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. జెడ్పీటీసీ అభ్యర్థి జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ గతంలో మండలంలో రూ.30 కోట్లతో గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, రహదారులు, సీసీ రోడ్లు, బోర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ అభ్యర్థి సుభద్ర, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు థింసా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ అరబీరు జగబందు, 23 పంచాయతీలకు చెందిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


