వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం

Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM

● గెలుపే లక్ష్యంగా శ్రేణులు శ్రమించాలి

● పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పిలుపు

చింతపల్లి: జిల్లాలోని అన్ని మండలాల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పాడేరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. శనివారం చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని చినసోమవరం, బర్రెంబంద, సోమవరం తదితర గ్రామాల్లో ఆయన పర్యటించి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామగ్రామాన ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ఎంపీటీసీ అభ్యర్థి సుండ్రు శిరీష, మాజీ సర్పంచ్‌ సుండ్రు చిన్నబ్బాయి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement