కొయ్యూరు: వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గొడ్డేటి మాధవి శనివారం రావణాపల్లి సెగ్మెంట్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. అంతాడ, బంగారంపేట, రాజుపేట, రావణాపల్లి, వైఎన్ పాకల గ్రామాల్లో సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి రాజులమ్మతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలోనూ ప్రజలు వారికి స్వాగతం పలికారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓటర్లకు బ్యాలెట్ నమూనాలను పంపిణీ చేస్తూ ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని మాధవి కోరారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బడుగు రమేష్‌బాబు, వైస్ ఎంపీపీ అంబటి నూకాలు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు జల్లి బాబులు, యువనేత గొడ్డేటి మహేశ్, మాజీ సర్పంచ్‌లు చంద్రరావు, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.


