● సస్పెండైన నేతల ఆవేదన
ఎటపాక: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు టీడీపీలో విలువ లేదని టీడీపీ అరకు పార్లమెంట్ కార్యాలయ మాజీ కార్యదర్శి మువ్వా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశాలు పాటించలేదనే కారణంతో ఆయన్ని, మాజీ వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావును శుక్రవారం టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎటపాకలో శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే తమ కష్టాన్ని అనుభవించి ఇప్పుడు సస్పెండ్ చేసి టీడీపీ తమను మోసం చేసిందని వారు కంటతడి పెట్టారు. గిరిజన బిడ్డలంటే చులకనగా చూస్తున్నారని విమర్శించారు.


