మల్లకంభ పోటీల్లో బూరుగుపాలెం విద్యార్థిని ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

మల్లకంభ పోటీల్లో బూరుగుపాలెం విద్యార్థిని ప్రతిభ

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

మాకవరపాలెం: మల్లకంభ పోటీల్లో బూరుగుపాలెం హైస్కూల్‌ విద్యార్థిని ప్రతిభ చాటింది. మండలంలోని తూటిపాలకు చెందిన మర్రి షర్మిల బూరుగుపాలెం హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మల్లకంభ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. వచ్చే నెల 24 నుంచి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో షర్మిల పాల్గొననుంది. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల హెచ్‌ఎం మహాలక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు శుక్రవారం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement