మాడుగుల రూరల్: అర్నబ్ తుఫాన్ ప్రభా వం వల్ల కురిసిన వర్షాలకు బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద బొడ్డేరు నదిపై కాజ్‌వే కొట్టుకుపోవడంతో మాడుగుల, పాడేరు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులను కె.జె.పురం మీదుగా మళ్లించారు. పాడేరు డిపో నుంచి విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులు కె.జె.పురం మీదుగా నడుపుతున్నారు. ఇదే రహదారిలో కె.జె.పురం తాచేరు నదిపై వంతెన బలహీనంగా ఉంది. తాచేరు నది సమీపంలో కల్వర్టు శిథిలావస్థకు చేరింది. ఇప్పుడు వీటిపై ఆర్టీసీ బస్సులు నడపడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.


