మునగపాక: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మండలంలోని అరబుపాలెంలో జనసేన పార్టీ నాయకుడు బొడ్డేడ వెంకటస్వామినాయుడు(వెంకన్న) ఆ పార్టీ రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆడారి కమలప్రియ, ఎంపీటీసీ అభ్యర్థి నరాలశెట్టి భారతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బొడ్డేడ శ్రీనివాసరావు, దొడ్డి చిన్న, బొద్దపు శ్రీరామమూర్తి, మాజీ ఎంపీటీసీ బొడ్డేడ బుజ్జి, పార్టీ సీనియర్ నాయకులు నరాలశెట్టి సూర్యనారాయణ, ద్వారం జానకీరామ్, శ్రీపతి రామకృష్ణ, ఆడారి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక
మునగపాక మండల ఉపాధ్యక్షుడు, మునగపాక గ్రామ శాఖ అధ్యక్షుడు బీరా శ్రీనివాస్ శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. గత 15 సంవత్సరాలుగా బీజేపీకి సేవ చేసిన తగిన గుర్తింపు లేకపోవడంతో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఆయన ముందుకువచ్చారు. ఆయనకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కర్రి కోటి, పెంటకోట రాము, దాడి మురళి, కాండ్రేగుల రాము, విల్లూరి మోహన్, దాడి వీర పాల్గొన్నారు.
టీడీపీ నుంచి 20 కుటుంబాలు చేరిక
చీడికాడ: మండలంలోని జైతవరం పంచాయతీలో టీడీపీ నుంచి 20 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీ చేరారు. వారికి పార్టీ మండల అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రెడ్డి వాసు, రెడ్డి గౌతమి, రెడ్డి నారాయణమూర్తి, రెడ్డి హర్షావర్ధన్, బొబ్బిలి వరహామూర్తి, తంగేటి బుబ్జి, మొల్లి దేముడునాయుడు, సింగంపల్లి పైడినాయుడు, రెడ్డి రాజారావు, తదితర కుటుంబాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఈర్లె చైతన్య ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.


