సాక్షి విలేకరిపై దాడి చేసిన వారిని శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

సాక్షి విలేకరిపై దాడి చేసిన వారిని శిక్షించాలి

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

నక్కపల్లి: ఆత్మకూరు ‘సాక్షి’ విలేకరి సుబ్బారెడ్డిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ చంద్రరావు ఆధ్వర్యంలో పాత్రికేయులు నక్కపల్లిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న విలేకరులపై ఇటీవల కాలంలో దాడులు పెరుగుతున్నాయన్నారు. దాడుల నిరోధానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం దాదాపు ఏడు దశాబ్దాల నుంచి ఏపీయూడబ్ల్యూజే కృషి చేస్తోందని చెప్పారు. అనంతరం నక్కపల్లి సీఐ జె.మురళి, ఎస్‌ఐ సన్నిబాబులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు బి.వి. సత్యనారాయణ, పులిగా పెంటయ్య, కొవిరి వెంకటేష్‌, కె. తాతాజీ, ముద్దారాజు, సేనాపతి లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

యలమంచిలి రూరల్‌: ఆత్మకూరు రూరల్‌ సాక్షి విలేకరి సుబ్బారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడిని ఖండిస్తూ యలమంచిలిలో శుక్రవారం జర్నలిస్టులు నిరసన తెలిపారు. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం దాడికి పాల్పడిన వారి ని తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ సీఐ ధనుంజయరావుకు వినతిపత్రం అందజేశారు. యలమంచిలి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గొల్లవిల్లి చిన్నాజీ, ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్షుడు కిషోర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పి.వి.ఎస్‌. ఈశ్వరదత్తు, నాయుడు, ఆడారి నాగ శ్రీనివాస్‌, మళ్ల రాము, సోమిరెడ్డి మూర్తి, సూర్యప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement