కె.కోటపాడు: 14 ఏళ్ల వయస్సు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్య సిబ్బంది త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి చంద్రశేఖర్ దేవ్ తెలిపారు. చౌడువాడ పీహెచ్‌సీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇటీవల అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పీహెచ్‌సీలో దెబ్బతిన్న 50 అడుగుల ప్రహరీని ఆయన పరిశీలించారు. దీని మరమ్మతులకు నిధుల కోసం జిల్లా ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు తెలిపారు. విద్యుత్ అంతరాయంతో ఇక్కడ రిఫ్రిజరేటర్లలో నిల్వ ఉంచిన వ్యాక్సిన్లు పాడయ్యాయా లేదా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైద్యాధికారులు మాలంనాయుడు, బి.రామ్ చైతన్య పాల్గొన్నారు.
జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి చంద్రశేఖర్ దేవ్


