బాధ్యతగా పనిచేయకుంటే చర్యలు | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా పనిచేయకుంటే చర్యలు

Oct 30 2026 12:51 AM | Updated on Oct 30 2026 12:51 AM

● రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

● డీఎంహెచ్‌వో రియాజ్‌బేగ్‌

● కిలగాడ పీహెచ్‌సీ తనిఖీ

ముంచంగిపుట్టు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌ హెచ్చరించారు. గురువారం మండలంలోని కిలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. మందుల నిల్వలు, అధికంగా నమోదవుతున్న కేసులు, గర్భిణుల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలోని ల్యాబ్‌ను పరిశీలించి రక్త పరీక్షలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రక్త పరీక్షలు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ల్యాబ్‌ టెక్నీషియన్‌కు వివరించారు. అనంతరం వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ఆర్నాబ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. వైద్య సిబ్బంది గ్రామస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో అలసత్వం వహించరాదన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది పర్యటనల వివరాలు, ఇతర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.అనంతరం ఏఎన్‌ఎంలకు బీపీ కొలిచే యంత్రాలను పంపిణీ చేశారు. పీహెచ్‌సీలో నెలకొన్న సమస్యలను వైద్యాధికారిణి రమ్యప్రభను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో శౌరి, హెచ్‌వీ లక్ష్మీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement