పారిశుధ్య పనులు సత్వరమే పూర్తి | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్య పనులు సత్వరమే పూర్తి

Oct 30 2026 12:51 AM | Updated on Oct 30 2026 12:51 AM

కలెక్టర్‌ నిశాంతి ఆదేశం

పాడేరు రూరల్‌: పాడేరు పట్టణంలో పారిశుధ్య పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ నిశాంతి అధికారులను ఆదేశించారు. అర్నాబ్‌ తుపాను ప్రభావంతో పట్టణంలోని సుండ్రుపుట్టు, పాత బస్టాండ్‌ ప్రాంతాల్లో పేరుకుపోయిన డ్రైనేజీ చెత్త, వ్యర్థాలను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ పనులను గురువారం ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. డ్రైనేజీలపై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తక్షణమే తొలగించాలని, కాలువల్లో చెత్త పేరుకుపోకుండా పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను కారణంగా రోడ్లపై పడిన చెట్లను తొలగించాలని, దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలకు మరమ్మతులు చేపట్టి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా ఉన్న దుకాణాల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.జిల్లా కేంద్రంలోని రక్షిత తాగునీటి ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి ట్యాంకులో క్లోరినేషన్‌ పనులు చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి పి.ఎస్‌.కుమార్‌, డిప్యూటీ ఎంపీడీవో ఆర్‌.వి.ఎస్‌.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement