పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు ఇవే..
జల్లిపల్లి సుభద్ర
ముంచంగిపుట్టు
వంతాల శాంతి
పెదబయలు
గొడ్డేటి మాధవి కొయ్యూరు
సీదరి రాంబాబు పాడేరు
కమ్మిడి అశోక్
అరకులోయ
ఒంటుబు ప్రియాంక హుకుంపేట
డూరు జయవర్ధిని అనంతగిరి
కొరాబు అనూషాదేవి చింతపల్లి
ఐసరం మహేశ్వరి జి.మాడుగుల
కంకిపాటి గిరిప్రసాద్ గూడెంకొత్తవీధి
కిముడు హరి
డుంబ్రిగుడ
11 జెడ్పీటీసీ స్థానాలకు 70 మంది..
సాక్షి, పాడేరు: నవంబర్ 3న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 46 మంది, స్వతంత్రులు 24 మంది ఉన్నారు. ఈ వివరాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం రాత్రి వెల్లడించారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ, పార్టీ బి–ఫారాల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం 144 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 74 మంది ఉపసంహరించుకోగా, మిగిలిన 70 మంది పోటీలో ఉన్నారు. వీరికి జేసీ తిరుమణి శ్రీపూజ ఎన్నికల గుర్తులు కేటాయించారు. జిల్లాలోని అన్ని 11 జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మండలాల వారీగా అనంతగిరి జెడ్పీటీసీ స్థానానికి ఆరుగురు, అరకులోయకు తొమ్మిది మంది, డుంబ్రిగుడకు 10 మంది, హుకుంపేటకు ఎనిమిది మంది, పెదబయలుకు నలుగురు, ముంచంగిపుట్టుకు ఆరుగురు, పాడేరుకు ఐదుగురు, జి.మాడుగులకు ఆరుగురు, చింతపల్లికి ఐదుగురు, జి.కె.వీధికి ఎనిమిది మంది, కొయ్యూరుకు ముగ్గురు చొప్పున పోటీలో ఉన్నారు. జిల్లాలోని 172 ఎంపీటీసీ స్థానాలకు 648 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికార వర్గాలు తెలిపాయి.
వీరిలో 24మంది స్వతంత్ర అభ్యర్థులు


