ముంచంగిపుట్టు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్, జెడ్పీటీసీ అభ్యర్థి జల్లిపల్లి సుభద్ర కోరారు. మంగళవారం బంగారుమెట్ట పంచాయతీ పరిధిలోని సోలగంపుట్టు, కించాయిపుట్టు గ్రామాల్లో ఆమె, ఎంపీటీసీ అభ్యర్థి జగన్నాథం ప్రచారం నిర్వహించారు. కర్రిముఖిపుట్టు పంచాయతీలో పాంగి పద్మారావు, బాబుశాలలో బైరాగి విజయకుమార్, బరడలో జనం ప్రమీల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో 14 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, పింఛన్లపై ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. గ్రామస్థాయిలో అమలుకాని హామీలను ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ అరబీరు జగబందు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ జెడ్పీ చైర్‌పర్సన్,
జెడ్పీటీసీ అభ్యర్థి జల్లిపల్లి సుభద్ర


