ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

సింహాచలం: ఆర్థిక సమస్యలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జీవీఎంసీ 120వ వార్డు పరిధి అడవివరంలో చోటుచేసుకుంది. గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు తెలిపిన వివరాల ప్రకారం..చోడవరానికి చెందిన నాగులపల్లి అన్నపూర్ణ (42) అడవివరంలోని పూజారి కల్లాలు ప్రాంతంలో భర్త నాగులపల్లి రమేష్‌, ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె భర్త హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. అన్నపూర్ణ కొంతకాలంగా చీటీలు నిర్వహిస్తుండగా.. సుమారు రూ.50 లక్షల వరకు చీటీలు వేశారని, వాటికి సంబంధించిన డబ్బులు చెల్లించాలని చీటీదారులు ఒత్తిడి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ఆవరణలోని రేకుల షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement