సాక్షి, పాడేరు: స్థానిక ఎన్నికల సామగ్రి జిల్లా కేంద్రం పాడేరుకు సోమవారం చేరుకుందని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన ఎన్నికల సామగ్రి కిట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపడంతో వాటిని స్వీకరించామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి.నిశాంతి ఆదేశాల మేరకు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచామని డీపీవో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు.


