న | - | Sakshi
Sakshi News home page

న

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

కళ్లు..!

మన్యం రహదార్లులో గజానికో గుంత
రోడ్ల అభివృద్ధి పట్టని కూటమి ప్రభుత్వం

● దారి తప్పిన హామీలు.!

రకానికి

రాకపోకలకు గిరిజనుల నరకయాతన

పాడేరు నుంచి వడ్డాది వెళ్లే రోడ్డులో వంతాడపల్లి సమీపంలో అధ్వానంగా మారిన ఆర్‌అండ్‌బీ రోడ్డు

సాక్షి, పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారులతో పాటు గ్రామీణ పంచాయతీరాజ్‌ రోడ్లు గోతులతో అధ్వానంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా దెబ్బతిన్న రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

● పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే వడ్డాది రోడ్డులో పలు చోట్ల గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. పాడేరుకు సమీపంలోని సేరిబయలు, వంతాడపల్లి తోటల వద్ద నాలుగు చోట్ల రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు భయపడుతూ ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్డులోని ఘాట్‌ సెక్షన్‌లో మోదకొండమ్మ తల్లి పాదాలు, వ్యూ పాయింట్‌, 12వ మైలురాయి జంక్షన్‌ వద్ద గోతుల కారణంగా ప్రయాణం సాహసంగా మారింది. ఈ రహదారి అభివృద్ధికి ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు.

● పాడేరు–చింతలవీధి రోడ్డులో మెడికల్‌ కళాశాల సమీపంలో గోతులు వాహనదారులను భయపెడుతున్నాయి. హుకుంపేట మండల కేంద్రంలోని రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. గుత్తులపుట్టు మార్గంలో కల్వర్టు వద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. పెదబయలు నుంచి ముంచంగిపుట్టు వరకు ఇటీవల అభివృద్ధి చేసిన రోడ్డులో కూడా వర్షాల కారణంగా అంచులు మట్టికోతకు గురయ్యాయి.

అమ్మో.. గ్రామీణ రోడ్లు

జిల్లాలోని మారుమూల గ్రామాలకు వెళ్లే పాత రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారాయి. ప్రధాన రోడ్లు గోతులతో నిండిపోయినా, వాటిని తిరిగి తారురోడ్లుగా మార్చే పనుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుకుంపేట మండలంలోని అల్లంపుట్టు–గూడ–మఠం మార్గం, చింతపల్లి మండలంలోని చౌడుపల్లి–పశువులబంద, ముంచంగిపుట్టు–కుమడ రహదారి, పెదబయలు మండలంలోని గుల్లెలు–గిన్నెగరువు రోడ్లు అధ్వానంగా మారాయి. డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపుట్టు రోడ్డు, అరకులోయ మండలంలోని సుంకరమెట్ట జంక్షన్‌ నుంచి జనంగూడ మీదుగా మాడగడ మార్గం, గన్నెల–సిరగం రహదారి, జి.మాడుగుల మండలంలోని సోలభం, గడుతూరు, గెమ్మెలి, లువ్వాసింగి రోడ్లు కూడా గోతులమయంగా మారాయి. రోడ్ల దుస్థితి కారణంగా వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హామీ మేరకు నిధులు కేటాయించాలి

మండల కేంద్రం అరకులోయ నుంచి కొత్తవలస, కోడిపుంజువలస మీదుగా శిరగాం గ్రామం వరకు రహదారి పూర్తిగా శిథిలమైంది. గత కొన్నేళ్ల క్రితం నిర్మించిన బీటీ రోడ్డులో ప్రస్తుతం పాదచారులు కూడా నడవలేని పరిస్థితి. కూటమి నేతలు ఎన్నికల హామీలను నెరవేర్చాలి. రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించాలి.

–బురిడి పాపారావు, లంతంపాడు గ్రామం, అరకులోయ మండలం

ప్రధాన రోడ్డును అభివృద్ధి చేయాలి

పాడేరు నుంచి వంతాడపల్లి పోయే ఆర్‌అండ్‌బీ రోడ్డులో పలుచోట్ల పెద్ద గోతులు భయపెడుతున్నాయి. బైక్‌ నడిపిందుకు ఇబ్బందిగా మారింది. రోడ్డు పూర్తిగా పాడైనందున కొత్తగా తారురోడ్డు నిర్మించి అభివృద్ధి చేయాలి. మైదాన ప్రాంతానికి పోయే ప్రధాన రోడ్డు అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం.

–గబ్బాడ చిట్టిబాబు, రాములపుట్టు గ్రామం, పాడేరు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement