సినిమా చిత్రీకరణకు ఉత్తమ ప్రదేశంగా ఎంపిక
డుంబ్రిగుడ: సినిమా చిత్రీకరణకు అనువైన ఉత్తమ ప్రదేశం విభాగంలో అరకు పైనరీకి రాష్ట్ర స్థాయి పర్యాటక ఉత్తమ పురస్కారం దక్కింది. ఈ మేరకు ఈ నెల 27న విజయవాడలో నిర్వహించిన పర్యాటక ఉత్తమ పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించినట్లు పైనరీ మేనేజర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్న అటవీశాఖ అరకు రేంజర్ కోటేశ్వరరావుతో పాటు సిబ్బందికి, శాంతినగర్ వన సంరక్షణ సమితి సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


