ఫోన్‌లోనే పర్యాటక వివరాలు | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌లోనే పర్యాటక వివరాలు

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

జిల్లా టూరిజం అధికారి పట్టాసి చలపతిరావు

మహిళా డిగ్రీ కళాశాలలో క్యూఆర్‌ కోడ్‌ ఆవిష్కరణ

అరకులోయటౌన్‌: పర్యాటక శాఖ వెబ్‌సైట్‌కు సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ను జిల్లా టూరిజం అధికారి పట్టాసి చలపతిరావు సోమవారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘డిజిటల్‌ టూరిజం–ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ టూ రీడిజైన్‌ టూరిజం’అనే థీమ్‌తో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పర్యాటక ప్రాంతాలు, వసతి, సేవల వివరాలను మొబైల్‌లోనే పొందే సదుపాయం కల్పించామని తెలిపారు. అల్లూరి జిల్లా పర్యాటక ప్రదేశాలను డిజిటల్‌ వేదికపైకి తీసుకువచ్చామన్నారు. పర్యాటకులు ఒకే వేదిక ద్వారా అవసరమైన సమాచారాన్ని సులభంగా తెలుసుకునేలా వెబ్‌సైట్‌ను రూపొందించామని వివరించారు. పర్యాటకులు తమ ఇంటి నుంచే ముందుగా ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవడంతో పాటు సందర్శించదలచిన ప్రదేశాలపై పూర్తి వివరాలు తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌ను ఎలా యాక్సెస్‌ చేయాలి, పర్యాటక సమాచారం ఎలా పొందాలనే అంశాలపై ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కుసుమ కుమారి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ శశికుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ మురళీకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement