వైఎస్సార్‌సీపీలోకి బట్టిమెట్ట గ్రామం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి బట్టిమెట్ట గ్రామం

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

● 100 మందిని పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ● వాగు దాటి నడిచి వచ్చిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం

కొయ్యూరు: మండలంలోని నడింపాలెం పంచాయతీ బట్టిమెట్ట గ్రామానికి చెందిన 30 కుటుంబాల నుంచి 100 మంది ఓటర్లు సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటి వరకు టీడీపీ, బీజేపీలకు మద్దతు తెలిపిన ఈ గ్రామస్తులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని, ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ మార్పునకు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, ప్రస్తుతం అవి నిలిచిపోయాయని ఆరోపించారు. చంద్రబాబు ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. ముందుగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు శరభన్నపాలెం నుంచి సుమారు కిలోమీటరు నడుచుకుంటూ, వాగు దాటి గ్రామానికి చేరుకున్నారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు బి.అప్పారావు, మాజీ మండల ఉపాధ్యక్షుడు అప్పన వెంకటరమణ, మాజీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు, సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు రేగటి ముసిలినాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.అచ్యుత్‌, పాటి శేఖర్‌, గొడ్డేడి మహేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement