నీట్ పీజీ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 5వేల ర్యాంక్ సాధించిన హరిణితో తల్లిదండ్రులు
మునగపాక : నీట్ పీజీ 2026 పరీక్ష ఫలితాల్లో మునగపాకకు చెందిన కొమ్మూరి హరిణి ఆలిండియా స్థాయిలో 5వేల ర్యాంక్‌ను సాధించింది. నీట్ పీజీ పరీక్ష ఆగస్టు 30వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. మునగపాకకు చెందిన కొమ్మూరి శ్రీనివాసరావు, ప్రవళిక దంపతుల కుమార్తె హరిణి ఆలిండియా స్థాయిలో 5000 ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. హరిణి భువనేశ్వర్‌లోని ప్రఖ్యాత ఎయిమ్స్‌లో మెడిసిన్ చదువుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు మెడిసిన్‌లో ఫ్రొఫెసర్ల సహకారంతో తనకు ఈ ర్యాంక్ వచ్చినట్లు హరిణి తెలిపారు. హరిణి ప్రతిభకు మునగపాక గ్రామస్తులతో పాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


