మన్యంలో కుండపోత | - | Sakshi
Sakshi News home page

మన్యంలో కుండపోత

Sep 20 2026 12:45 AM | Updated on Sep 20 2026 12:45 AM

సాక్షి, పాడేరు/జి.మాడుగుల/సీలేరు: తుపాన్‌ ప్రభావంతో ఏజెన్సీలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సుమారు 2 గంటల పాటు కుండపోతగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. హుకుంపేట వారపుసంతలో చిరువ్యాపారులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జి.మాడుగులలోను భారీ వర్షం కురిసింది. డుంబ్రిగుడ, అరకులోయ, సీలేరు ప్రాంతాలలో సాయంత్రం వర్షం పడింది. ఖరీఫ్‌ వ్యవసాయ పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తాయని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement