గర్భిణులకు భోజనం వడ్డిస్తున్న బాలాజీ దంపతులు
సీలేరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతినెల 9వ తేదీన వైద్య పరీక్షల కోసం వచ్చే గర్భిణులు, రోగులకు సీలేరు బాలాజీ రెస్టారెంట్ యజమాని నక్క జ్ఞానేశ్వర్ రావు–భార్య ఉచిత భోజన సదుపాయం ప్రారంభించారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చే గర్భిణులు రోజంతా ఆకలితో అలమటించడాన్ని గమనించి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఆసుపత్రి ఎదుట అన్నసంతర్పణ నిర్వహించి గర్భిణులకు భోజనాలు వడ్డించారు. ప్రతి నెల 9న ఈ సేవలు అందిస్తామని తెలిపిన ఆ దంపతుల ఉదారతను గ్రామస్తులు అభినందించారు.


