అక్షరం రాని చేతులే.. అద్భుత శిల్పాలను చెక్కుతున్నాయి! సవర ఆర్ట్‌, మట్టి పాత్రలు, వెదురు అలంకరణలు.. ఒకటేమిటి, గిరిజన కళల రూపురేఖలను మార్చేందుకు అరకు వేదికగా ఒక నైపుణ్య విప్లవం సాగుతోంది. స్థానిక కళాకారుల నైపుణ్యానికి అంతర్జాతీయ మార్కెట్‌ గుర్తింపు తెచ్చేలా | - | Sakshi
Sakshi News home page

అక్షరం రాని చేతులే.. అద్భుత శిల్పాలను చెక్కుతున్నాయి! సవర ఆర్ట్‌, మట్టి పాత్రలు, వెదురు అలంకరణలు.. ఒకటేమిటి, గిరిజన కళల రూపురేఖలను మార్చేందుకు అరకు వేదికగా ఒక నైపుణ్య విప్లవం సాగుతోంది. స్థానిక కళాకారుల నైపుణ్యానికి అంతర్జాతీయ మార్కెట్‌ గుర్తింపు తెచ్చేలా

Sep 10 2026 12:45 AM | Updated on Sep 10 2026 12:45 AM

మూడు చోట్ల ప్రత్యక్ష శిక్షణ

అరకు గిరిజన మ్యూజియం: ఇక్కడ లక్క బొమ్మల తయారీ, రంగురంగుల గాజులు, సంప్రదాయ సవర ఆర్ట్‌, బుద్ధ్ధ కళలపై శిక్షణ ఇస్తున్నారు.

మాడగడ: మట్టితో మ్యాజిక్‌ చేసే టెర్రకోట ఆర్ట్‌, వివిధ రకాల అలంకరణ పాత్రలు, మట్టి కళాకృతుల తయారీ సాగుతోంది.

ముసిరిగూడ గ్రామం:

స్థానికంగా లభ్యమయ్య వెదురుతో అందమైన గృహాలంకరణ వస్తువులుగా, హస్తకళలుగా మలిచే బ్యాంబూ క్రాఫ్ట్‌ శిక్షణ ఇస్తున్నారు.

ఇతర రాష్ట్రాల కళాకారుల భాగస్వామ్యం..

స్థానిక కళాకారులకు ప్రాక్టికల్‌ నైపుణ్యం అందించేందుకు దేశంలోని ప్రముఖ హస్తకళా నిపుణులను రప్పించారు. వెదురు ఉత్పత్తుల తయారీలో ఛత్తీస్‌గఢ్‌ నిపుణులు, మట్టి కళలలో ఒడిశా మాస్టర్‌ క్రాఫ్ట్స్‌మన్‌, లక్క ఆర్ట్‌లో రాజస్థాన్‌ హస్తకళాకారులు స్థానిక గిరిజనులకు స్వయంగా శిక్షణనిస్తున్నారు. గిరిజన సంస్కృతికి వ్యాపారాత్మక గుర్తింపు తెచ్చి, కళాకారులకు ఆర్థిక ఊతమివ్వడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగరాజు చిక్కాల, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కాట్రగడ్డ శ్రీనివాస వరప్రసాద్‌, అధికారులు ఎన్‌. మురళీకృష్ణ ప్రసాద్‌, జి. గణపతి నాయుడు, పిచ్చయ్య నాయుడు, మ్యూజియం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement