హస్తకళల్లో శిక్షణ పొందుతున్న మహిళలు
వెదురుతో కళాకృతుల తయారీలో నిమగ్నమైన
అరకులోయ టౌన్: డుంబ్రిగుడ మండలం లైగండ హెచ్‌ఎం జ్యోతి లక్ష్మి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడం అభినందనీయమని అరకులోయ మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే పాల్గుణ అరకులోయలోని జ్యోతి లక్ష్మి నివాసానికి వెళ్లి, ఆమెను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మారుమూల గిరిజన ప్రాంతంలో జన్మించి, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ ఏడాది ఉమ్మడి విశాఖ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి, 8వ తరగతి గణిత పాఠ్యాంశాల రూపకల్పనలో రచయిత్రిగా కీలక పాత్ర పోషించి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకోవడం ఆమె కుటుంబ సభ్యులకు, తోటి ఉపాధ్యాయులు, గిరిజన ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. జ్యోతి లక్ష్మిని సన్మానించిన వారిలో మాజీ సర్పంచ్ పాడి రమేష్, మాజీ ఎంపీటీసీలు శెట్టి వెంకటరావు, బూర్జ సుందర్‌రావు, పార్టీ నాయకులు బాక సింహాచలం, కొర్రా బలరామ్, ఉపాధ్యాయుడు మండియకేడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


