● పాఠశాల లేక లుక్కురు, టిక్రపడ, పనసపుట్టు విద్యార్థుల అవస్థలు
కాలినడకన కడుతుల పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు
ముంచంగిపుట్టు: గిరిజన విద్యార్థులు చదువుకోవాలంటే ప్రతిరోజూ మూడు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. పనసపుట్టు పంచాయతీ కడుతుల గ్రామంలో ఉన్న మండల పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాలకు లుక్కురు, టిక్రపడ, పనసపుట్టు గ్రామాలకు చెందిన 26 మంది విద్యార్థులు రోజూ 3 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పిల్లలు ప్రతిరోజూ ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి గుండా నడుచుకుంటూ బడికి వెళ్తున్నారు. అది ప్రధాన రహ దారి కావడంతో బస్సులు, లారీలు, జీపులు ఎక్కువగా తిరుగుతుంటాయి. దీంతో పిల్లలు బడికి వెళ్లి సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చే వరకు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.తమకు సమీపంలోనే లేదా అందుబాటులో ఒక ప్రాథమిక పాఠశా లను ఏర్పాటు చేస్తే కష్టాలు తొలగుతాయని ఈ గ్రా మాల గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


