జెడ్పీ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి

Sep 10 2026 12:45 AM | Updated on Sep 10 2026 12:45 AM

ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర

పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

శిలాఫలకం ఆవిష్కరించిన

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

ముంచంగిపుట్టు: ప్రజల సంక్షేమం కోసం జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేసి చూపించామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ కేంద్రంలో జెడ్పీ నిధులు రూ.20 లక్షలు, మండల పరిషత్‌ నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన సామాజిక భవన ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించి, రిబ్బన్‌ కత్తిరించి భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనుగ్రహంతో, ప్రజలు ?నకిచ్చిన అవకాశంతో గిరిజన ప్రాంత అభివృద్ధి, సంక్షేమం కోసం నిత్యం కృషి చేశానని తెలిపారు. గిరిజన గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, బోర్లు, భవన నిర్మాణాలు చేపట్టామని, ఈ పనుల్లో తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు నిరంతరం అండగా నిలిచారన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ... గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత లభించిందన్నారు. జెడ్పీ పీఠాన్ని గిరిజన మహిళకు కేటాయించడం వల్ల గిరిజన గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం సాధ్యమైందని కొనియాడారు. సామాజిక భవనాన్ని అందుబాటులోకి తెచ్చిన జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర–మూర్తి దంపతులకు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ భాగ్యవతి, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, నబ్బో, గణపతి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, జేసీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ జగబంధు, మాజీ సర్పంచులు నీలకంఠం, రమేష్‌, పార్టీ నాయకులు సోలమన్‌, దాశరథి, మణి, తిరుపతి, రామరాజు, బుద్ధ, రామచందర్‌, వివిధ శాఖల అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement