మునగపాకలో డీఎస్పీ విచారణ | - | Sakshi
Sakshi News home page

మునగపాకలో డీఎస్పీ విచారణ

Aug 20 2026 12:23 AM | Updated on Aug 20 2026 12:23 AM

మునగపాక: మేజర్‌ పంచాయతీ మునగపాకలో బుధవారం పరవాడ డీఎస్పీ మోహనరావు పర్యటించారు. రెండు రోజుల క్రితం స్థానిక పల్లపు వీఽధికి చెందిన పొలిమేర దేవకీ నాగప్పారావు హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా హతుడి కుటుంబ సభ్యుల నుంచి ఆయన వివరాలు సేకరించారు. నిందితులకు సంబంధించిన సమాచారం సేకరించారు. సాక్షుల విచారణ జరుగుతుందని ఇందుకు సహకరించాలన్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తులు అరెస్టు అయ్యారన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ పి.ప్రసాదరావు పాల్గొన్నారు.

కొట్లాట కేసులో విచారణ..

ఇటీవల మునగపాక బైపాస్‌ రోడ్డులో కుంచవానిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిపై జరిగిన దాడికి సంబంధించి సాక్షిని డీఎస్పీ మోహనరావు విచారణ చేశారు. కొట్లాటలో ఎవరెవరు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం ఏం జరిగిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement