రోలుగుంట: లోసింగిలో గర్భిణి పాంగి రాజేశ్వరి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గిరిజనులు సీపీఎం జిల్లా కార్యవర్గం సభ్యుడు గోవింద ఆధ్వర్యంలో బుధవారం లోసింగిలో ధర్నా చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్. ఎమ్మెల్యే గతంలో ఇచ్చిన హమీలు నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఆశా కార్యకర్తను ఏర్పాటు చేయాలని, 320 మంది జనాభా ఉన్న ఈ గ్రామాలకు అంగన్‌వాడీ పోస్టు మంజూరు చేయాలని, అద్వానంగా ఉన్న రహదారి సమస్య మెరుగుపరచాలని కోరుతూ పలు దఫాలు ధర్నా చేయడం జరిగందన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్, చోడవరం ఎమ్మెల్యే రాజు కొండ ఎగువన ఉన్న ఈ గ్రామాలను సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే సమస్యలు అలాగే ఉన్నాయని, మాతృ, శిశు మరణాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.


