భార్యతో వివాదం..భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భార్యతో వివాదం..భర్త ఆత్మహత్య

Aug 20 2026 12:23 AM | Updated on Aug 20 2026 12:23 AM

కోటవురట్ల: భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం గ్రామానికి చెందిన పొలుమూరి ఈశ్వరరావు(36) కార్పెంటర్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య నూకరత్నం బ్రాండిక్స్‌ కంపెనీలో పనిచేస్తుండగా ఆమైపె అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకోవడంతో నాలుగు రోజుల క్రితం భార్య అలిగి తన పుట్టింటికి ఎస్‌.రాయవరం మండలం ధర్మవరం వెళ్లిపోయింది. భార్యను తిరిగి ఇంటికి రమ్మని ఈశ్వరరావు పదే పదే ఫోన్‌ చేసినప్పటికీ రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు అతని భార్యకు ఫోన్‌ చేసి చెప్పగా రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి ఈశ్వరరావు విగతజీవిగా కనిపించాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

మృతుడు ఈశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement