కశింకోట: డ్యూషెన్ మస్క్యూలర్ డిస్ట్రోఫీ సమస్య (కాల క్రమేణా కండరాలు బలహీనపడి క్షిణించిపోయే జన్యుపరమైన వ్యాధుల సమూహం)తో బాధపడుతున్న విద్యార్థికి కశింకోటలోని సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది సంయుక్తంగా రూ.3.49 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇదే స్కూల్లో 2వ తరగతి చదువుతున్న పొన్నగంటి ప్రణయ్ సూర్య వైద్య చికిత్సకు మానవతా దృక్ఫథంతో ఆర్థిక సహాయం సమకూర్చి బుధవారం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు అందించారు. తన స్కూల్లో చదివినంత కాలం ప్రణయ సూర్యకు ఉచిత విద్య అందిస్తామని పాఠశాల యాజ మాన్యం ప్రకటించింది.


