● కేజీహెచ్‌లో నిర్వహించిన
పరీక్షల్లో నిర్ధారణ
● హోమ్ ఐసోలేషన్‌కు రిఫర్
రోలుగుంట: మండల కేంద్రం రోలుగుంటకు చెందిన 58 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం... రోలుగుంటలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళ ఈ నెల 24వ తేదీన విశాఖపట్నంలో కుమార్తె ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత జ్వరం, దగ్గు రావడంతో ఆమెను కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. కరోనా లక్షణాలు ఉండడంతో అక్కడే పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు విశాఖ డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారని స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రావణి ఆది వారం చెప్పారు. స్వల్ప లక్షణాలుండడంతో ఆమెకు మందులిచ్చి హోమ్ ఐసోలేషన్‌లో ఉంచాలని ఇంటికి పంపించారు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, విశాఖలోనే వైద్య సేవలందిస్తున్నారని వైద్యాధికారి చెప్పారు.


