పాడేరు రూరల్: లెప్రసీ సర్వేకు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయిలో తక్ష ణం విచారణ జరిపించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందర్‌రావు తెలిపారు. ఆయ గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటికీ లెప్రసీ సర్వేలో భాగంగా పాడేరు మండలానికి సంబంధించి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో భాగంగా ఆశా కార్యకర్తలు, సీహెచ్‌డబ్ల్యూలతో లెప్రసీ సర్వే నిర్వహించేందుకు రూ.1100 చొప్పున చెల్లించాల్సి ఉంది, అయితే వాటిని చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని లేని పక్షంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆందోళన చేపడతామన్నారు.


