సాక్షి,పాడేరు: స్థానిక ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, రమాదేవి దంపతులతో పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం వేదపండితులు, పలు ఆలయాల అర్చకులంతా పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం అర్చకులు, వేదపండితులను దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అలాగే పలు సంస్కృతిక కార్యక్రమాల ను నిర్వహించారు. ఉప సర్పంచ్ బూరెడ్డి రాము నాయుడు, ఆలయ కమిటీ ప్రతినిధులు వంతెన్భ రాజబాబు, కొట్టగుళ్లి రామారావు, కొమ్మోజు వెంకటరమణ, ఉడా త్రినాథ్, శ్రీనాధు శ్రీను, ముకుందరావు, శివరాత్రి శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


