మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి షియాజ్ ఖాన్
నర్సీపట్నం: ఈ నెల 14న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్ పేర్కొన్నారు. పోలీసు, బ్యాంక్, మున్సిపల్ అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీమార్గంలో కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ చక్కటి వేదికన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి జూనియర్ సివిల్ జడ్జి స్పందన, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రమేష్, సీఐలు, ఎస్సైలు, మున్సిపల్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


