కశింకోట: బయ్యవరంలో ఒక దుకాణంలో దొంగతనానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. బయ్యవరంలోని లక్ష్మి ఏజెన్సీకి చెందిన దుకాణం షెల్టర్‌ను బత్తిన సింహాచలం ఎలియాస్ పండు గత ఏడాది డిసెంబర్ 2న పైకి పెకలించి తెరచి దానిలో ఉన్న సుమారు రూ.65 వేల నగదును తస్కరించి పరారయ్యాడు. ఈ సంఘటనపై ఏజెన్సీ నిర్వాహకుడు దరిమిరెడ్డి దిలీప్‌కుమార్ పోలీ సులకు ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐలు మనోజ్‌కుమార్, లక్ష్మణరావుల ఆధ్వర్యంలో సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి కేసు ఛేదించడంలో భాగంగా సీసీటీవీ పుటేజి, టెక్నిక ల్ డేటా ఆధారంగా దొంగతనానికి పాల్పడిన సింహాచలంను అనుమానించి అతని కదలికలపై నిఘా వేశారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిగా నిర్ధారణ కావడంతో నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి చోరీ నగదును స్వాధీ నం చేసుకున్నామని సీఐ తెలిపారు.


