అనకాపల్లి : నూకాంబిక అమ్మవారి ఆలయ సాక్షిగా శుక్రవారం కూటమి నేతల్లో ఆధిపత్య పోరు భగ్గుమంది. అనకాపల్లిలో టీడీపీ, జనసేన నాయకులు అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరుతున్నాయి. నియోజకవర్గంలో జనసేన నాయకులు చెప్పిన పనులు మాత్రమే చేయాలని నియోజకవర్గ స్థాయి అధికారులకు జనసేన నాయకులు అదేశాలు జారీ చేస్తున్నారు. దీనిలో భాగంగా పట్టణంలో నూకాంబిక అమ్మవారి ఆలయ రహదారిలో 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్‌కు(కూటమి కార్పొరేటర్) రహదారికి ఆనుకుని ఉన్న దుకాణాలు తక్షణమే తొలగించాలని జోనల్ కమిషనర్‌కు జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు అదేశాలు జారీ చేయడంతో శుక్రవారం తెల్లవారు జామున జోనల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారులు రెండు పొక్లెయిన్‌లు తీసుకుని వచ్చిన రెకుల షెడ్‌తో ఉన్న దుకాణాలను తొలగించారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్ సంఘటనా స్థలానికి చేరుకుని పొక్లెయిన్‌కు అడ్డుగా రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమ మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న రేకుల షెడ్‌ను జీవీఎంసీ అధికారులు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం అన్యాయమన్నారు. వార్డు పరిధిలో అనేక అక్రమాల నిర్మాణాలు ఉన్నాయని, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, రహదారికి అడ్డంగా ఉందని సాకు చూపించి నాకు సంబంధించిన రేకుల షెడ్‌ను తొలగించడం అన్యాయమన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. షెడ్‌ల్లో ఉన్న సామగ్రి పూర్తిగా ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. కార్పొరేటర్ భర్త కొణతాల భాస్కర్ మాట్లాడుతూ అమ్మవారి ఆలయం ఎదురుగా తనకు కొంత స్థలం ఉన్నాదని, ఆ పక్కనే ఉన్న కందిపూడి దుర్గలక్ష్మి స్థలాన్ని లీజుకు తీసుకుని వారి అనుమతితో సుమారుగా రోడ్డు నుంచి 10 అడుగుల దూరంలో 60 అడుగుల్లో షెడ్లు నిర్మించడం జరిగిందన్నారు. అయితే విత్‌అవుట్ నోటీస్‌తో జీవీఎంసీ అధికారులు వచ్చి షెడ్‌ను కూల్చివేయడయం జరిగిందన్నారు. షెడ్ నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అయిందని, షెడ్‌లో సుమారు రూ.10 లక్షల విలువగల సామగ్రి ఉందని మొత్తం రూ.20 లక్షలను జీవీఎంసీ అధికారులు తక్షణమే చెల్లించాలన్నారు. అనకాపల్లిలో కక్షపూరిత చర్యలు చేపట్టడం అన్యాయమన్నారు. తన వార్డు పరిధిలో ఎక్కడైనా అక్రమాలు జరిగితే స్వయంగా వెళ్లి అడ్డుకునేవాడినని అన్నారు. కందిపూడి దుర్గలక్ష్మి స్థలం పక్కన ఉన్న పెతకంశెట్టి జోసెఫ్‌కు జీవీఎంసీ అధికారులు నోటీసు ఇచ్చారు. దుర్గలక్ష్మి స్థలానికి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదన్నారు. కూటమిలో ఉన్నందు వల్ల షెడ్‌ను కక్షఫూరితంగా తొలగించారని ఆయన ఆరోపించారు. ఇప్పటికై న కక్షసాధింపు చర్యలు మానుకోవాలని లేని పక్షంలో తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.


