అట్టహాసంగా పీసా మహోత్సవ్‌ | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌

Dec 24 2025 4:20 AM | Updated on Dec 24 2025 4:20 AM

అట్టహ

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌

● ఉత్సాహంగా ఖేలో ఇండియా కబడ్డీ, ఆర్చరీ క్రీడా పోటీలు ● గిరిజన ఉత్పత్తులు, ఆహార పదార్థాలతో 68 స్టాళ్లు ఏర్పాటు

● ఉత్సాహంగా ఖేలో ఇండియా కబడ్డీ, ఆర్చరీ క్రీడా పోటీలు ● గిరిజన ఉత్పత్తులు, ఆహార పదార్థాలతో 68 స్టాళ్లు ఏర్పాటు

స్టాల్‌ను పరిశీలిస్తున్న

పంచాయతీరాజ్‌ రాష్ట్ర కమిషనర్‌ కృష్ణ తేజ

స్టాల్‌ను పరిశీలిస్తున్న కేంద్ర పంచాయతీరాజ్‌ జాయింట్‌ సెక్రటరీ ముక్తా శేఖర్‌,చిత్రంలో అవార్డు గ్ర హీత జ్యోతి సురేఖ

క్రీడా మస్కట్‌తో అతిథులు

ఆర్చరీ క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న కేంద్ర పంచాయతీరాజ్‌ జాయింట్‌ సెక్రటరీ ముక్తా శేఖర్‌

మహారాణిపేట: పోర్టు స్టేడియంలో పెసా మహోత్సవ్‌ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పంచాయతీరాజ్‌ జాయింట్‌ సెక్రటరీ ముక్తా శేఖర్‌, ఏపీ పంచాయతీ రాజ్‌– గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ, ఆర్చరీ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు. ముందుగా వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనులు ఏర్పాటు చేసిన 68 స్టాళ్లు లాంఛనంగా ప్రారంభించి అక్కడ ప్రదర్శనలో ఉంచిన గిరిజన ఉత్పత్తులను, సాంప్రదాయ వంటకాలను పరిశీలించారు. హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన గిరిజన మహిళలు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, మంగళగిరి, వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, సాంప్రదాయ ఆహార ఉత్పత్తులు, బాంబూ చికెన్‌ తదితర ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.

ఉత్కంఠగా సాగిన క్రీడా పోటీలు

ఖేలో ఇండియా కబడ్డీలో 10 రాష్ట్రాల నుంచి 18 టీమ్‌లు భాగస్వామ్యమయ్యాయి. అందులో పురుష జట్లు 10, మహిళా జట్లు 8 పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్‌ విజేతగా నిలవగా, రన్నర్‌ జట్టుగా ఒడిశా, మూడో స్థానంలో తెలంగాణ, గుజరాత్‌ జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో జార్ఖండ్‌గా విజేతగా నిలవగా, రన్నర్‌గా మధ్యప్రదేశ్‌ జట్టు నిలిచింది. మూడో స్థానంలో మహారాష్ట్ర, ఒడిశా జట్లు ఉన్నాయి.

●ఆర్చరీ క్రీడా పోటీలో 8 రాష్ట్రాలకు చెందిన 20 మంది క్రీడాకారులు భాగస్వామ్యమయ్యారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన కృష్ణా పింగువా గోల్డ్‌ మెడల్‌, రాజస్థాన్‌కు చెందిన బద్రీ లాల్‌ మీనా సిల్వర్‌ పతకం సాధించుకున్నారు. మూడో స్థానంలో జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన దినేష్‌ ముర్ము నిలిచి బ్రాంజ్‌ మెడల్‌ సాధించుకున్నారు. మహిళా వ్యక్తిగత విభాగంలో రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఖుషీ ననోమా గోల్డ్‌ మెడల్‌, జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన అనురాధ కుమారి సిల్వర్‌ పతకం సాధించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అంబికా పాండే మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు.

●సాయంత్రం క్రికెట్‌ స్టేడియంలో నమూనా క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పలు రకాల విన్యాసాలు, నైపుణ్యాలను ప్రదర్శించారు. అధికారులు, క్రీడాకారులు, గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌ 1
1/6

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌ 2
2/6

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌ 3
3/6

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌ 4
4/6

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌ 5
5/6

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌ 6
6/6

అట్టహాసంగా పీసా మహోత్సవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement