
పరిశుభ్రతపై దృష్టి పెట్టండి
కూనవరం: వర్షాలు, వరదలు మూలంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పారిశుధ్యం పనుౖలపె దృష్టిసారించాలని చింతూరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శుభమ్ నొఖ్వాల్ అన్నారు. గోదావరి, శబరి వరదలకు టేకులబోరు ఉదయ భాస్కర్ కాలనీలో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, మురుగునీరు నిల్వ ఉండకూడదని ఆదేశించారు. శానిటేషన్, క్లీనింగ్‌పై ఎక్కువ శ్రద్దపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో జగన్నాథరావు, సర్పంచ్ హేమంత్, కార్యాదర్శి, వీఆర్వో, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
నిత్యావసర సరకులు అందిస్తాం
చింతూరు: గోదావరి వరద కారణంగా కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో ప్రభావితమైన 4,689 కుటుంబాలకు నిత్యావసర సరకులు అందిస్తామని చింతూరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శుభం నొఖ్వాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గోదావరి వరద కారణంగా కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో 41 గ్రామాలు ప్రభావితం కాగా 495 ఇళ్లు ముంపునకు గురయ్యాయని, 4,689 కుటుంబాలు వరదబారిన పడినట్లు ఆయన తెలిపారు. 96 మంది గర్భిణుల, 11 మంది డయాలసిస్ రోగులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 75 వైద్యశిబిరాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు పీవో తెలిపారు.
చింతూరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో
శుభమ్ నొఖ్వాల్