
పునరావాసం నుంచి ఇళ్లకు..
చింతూరు: వరదనీరు గ్రామాలను కూడా వీడుతుండటంతో పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న బాధితులు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. గోదావరి, శబరి నదులు క్రమేపీ తగ్గుతుండడంతో వరదనీరు రహదారులపైనుంచి తొలగుతోంది. గోదావరి ఉధృతికి కూనవరం మండలం పోలిపాక వద్ద గతంలో కొట్టుకుపోయిన ప్రాంతంలోనే మరోసారి 10 మీటర్ల మేర రహదారి కొట్టుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
● భద్రాచలం, కూనవరం ప్రధాన రహదారిపై వరదనీరు తొలగడంతో శనివారం ఉదయం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. చింతూరు మండలంలో శబరినది ఉధృతి తగ్గడంతో వాగులు కూడా క్రమేపీ తగ్గుతున్నాయి. దీంతో వరదనీరు రహదారుల పైనుంచి తొలగడంతో రాకపోకలు సాగుతున్నాయి. – జాతీయ రహదారి–326 పైనుంచి కుయిగూరువాగు వరదనీరు తొలగడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు వాహనాలు యధావిధిగా నడుస్తున్నాయి. దీంతోపాటు చీకటివాగు, చంద్రవంక వాగుల వరద కూడా రహదారుల పైనుంచి తొలగింది. సోకిలేరువాగు వరద ఇంకా రహదారిపై నిలిచి ఉండటంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య ఆరో రోజు కూడా రాకపోకలు ప్రారంభం కాలేదు. దీంతోపాటు చింతూరు మండలంలో 11 గ్రామాలకు కూడా రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది.
ముంపు నుంచి తేరుకుంటున్న గ్రామాలు

పునరావాసం నుంచి ఇళ్లకు..