జలవిద్యుత్ కేంద్రాలకు ఊపిరి
● మేలు చేస్తున్న వర్షాలు
● సీలేరు ప్రాజెక్ట్‌లో కళకళలాడుతున్న జలాశయాలు
మోతుగూడెం: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోయర్ సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లోని జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నిండుగా కళకళలాడుతున్నాయి. జోలాపుట్టు, బలిమెల, గుంటవాడ, డొంకరాయి, ఫోర్‌బే ప్రాజెక్ట్‌ల్లో ఇప్పటివరకు 56 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు ఏపీ జెన్‌కో అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో మరో పదిహేను రోజుల్లో జలాశయాలు పూర్తిస్ధాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది జలవిద్యుత్‌కు నీటి సమస్య లేనట్టేనని అధికారులు చెబుతున్నారు.
● ఆంధ్రా, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్ట్ జోలాపుట్టు ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది.
● బలిమెల, గుంటవాడ జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునేందుకు కొద్దిరోజులు పట్టే అవకాశం ఉంది.
● డొంకరాయి ప్రాజెక్ట్‌లో మరో నాలుగు అడుగుల నీరు చేరితే డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసే పరిస్థితులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
గతేడాదిఇలా..
గతేడాదితో పోలిస్తే నీటినిల్వలు ఈ ఏడాది కాస్త మెరుగ్గానే ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి జోలాపుట్టు జలాశయంలో 24.8372 టీఎంసీలు, బలిమెలలో 51.2325 టీఎంసీలు, గుంటవాడ జలాశయంలో 0.87720 టీఎంసీలు, డొంకరాయి జలాశయంలో 13.1572 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి
ప్రస్తుత నీటిమట్టాల వివరాలు
ప్రాజెక్ట్ ఎఫ్‌ఆర్‌ఎల్ ప్రస్తుతం ఇన్‌ఫ్లో నీటి నిల్వ
(అడుగులు) (అడుగులు) (క్యూసెక్కులు) (టీఎంసీలు)
జోలాపుట్టు 2750 2745 8056 27
బలిమెల 1516 1470 16271 26.800
గుంటవాడ 1360 1344 3550 1.5
డొంకరాయి 1037 1027 6478 10
ఫోర్‌బే 930 921 2214 0.1410
పూర్తిస్థాయిలో ఉత్పాదన
లోయర్ సీలేరు జలవిద్యుత్ కేంద్రం పరిధిలోని ప్రాజెక్ట్‌ల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయి ఉత్పాదన జరుగుతోంది. నీటిని పొదుపుగా వాడుతూ ఈ ఏడాది కూడా లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తాం.
– రాజారావు, చీఫ్ ఇంజనీర్,
ఏపీ జెన్‌కో మోతుగూడెం
జలవిద్యుత్ కేంద్రాలకు ఊపిరి
జలవిద్యుత్ కేంద్రాలకు ఊపిరి
జలవిద్యుత్ కేంద్రాలకు ఊపిరి


