
నూరుశాతం హాజరు తప్పనిసరి
● ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు
గంగవరం: పాఠశాలలో నూరుశాతం విద్యా ర్థుల హాజరు ఉండేలా చూసుకోవాలని ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వర్రావు ఆదేశించారు. శనివారం స్థానిక మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. హాజరు వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఉపాద్యాయుల డైరీ, పాఠ్య ప్రణాళికలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. డి.గ్రేడ్ విద్యార్థులకు 45 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఏ గ్రేడ్‌లోకి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.