
సస్యరక్షణతోఅధిక దిగుబడులు
చింతపల్లి: గిరిజన రైతాంగం ప్రస్తుతం కాఫీ పంటలో తెగుళ్లు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని ఏఈవో పి.ధర్మారాయ్ అన్నారు. మండలంలో కొత్తపాలెం, లోతుగెడ్డ పంచాయతీల పరిదిలో గల భీమసింగి, సూదిమెట్ట, గొడుగుమామిడి, తురుతుంపాడు, పిసిరిమామిడి గ్రామాల్లోని కాఫీ తోటలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాఫీ మొక్కలను బెర్రీ బొరారో కీటకం ఆశించే అవకాశం ఉందన్నారు. దీనిని ఆదిలోనే తుంచాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ బాలు, లైజన్‌వర్కర్ మల్లేశ్వరరావు, చింటిబాబు ,రామారావు రైతులున్నారు.