
పాముకాటుతో వ్యక్తికి అస్వస్థతత
రాజవొమ్మంగి: మండలంలోని అప్పలరాజుపేటకు చెందిన సేనాపతి సత్తిబాబు శనివారం రాత్రి పాముకాటుకు గురై అస్వస్థతతకు గురయ్యాడు. సత్తిబాబును కుటుంబీకులు వెంటనే రాజవొమ్మంగి పీహెచ్‌సీకు తరలించగా సిబ్బంది యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చి ప్రథమ చికిత్స చేశారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సిబ్బంది తెలిపారు. కాగా సత్తిబాబు రాజవొమ్మంగిలోని వారపు సంతకు వచ్చి నిత్యావసర సరకులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్దు దాటుతుండగా పాముపై అడుగు వేశాడు. దీంతో పాము కాటువేసినట్టు స్థానికులు తెలిపారు.