
ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం
కొయ్యూరు: సీఎం చంద్రబాబు పాలన అంతా ప్రజలను మోసం చేయడంతోనే ప్రారంభమవుతుందని జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తారని ప్రజలు భావిస్తే చివరకు వాటిని అమలు చేయకుండా ఓట్లు వేసిన ప్రజలను దగా చేస్తున్నారని విమర్శించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బిడిజన అప్పారావు అధ్యక్షతన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 144 హామీల్లో దేనిని పూర్తిగా అమలు చేయలేదన్నారు. వైఎస్సార్‌సీపీ విమర్శలు చేయడంతోనే తల్లికి వందనం అమలు చేశారన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తామన్న హామీని పూర్తిగా అమలు చేయలేదన్నారు. గ్రామాల్లో సగం మందికి కూడా ఇది రాలేదన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఎవరికి ఇవ్వలేదన్నారు. దీనిపై కొద్ది రోజుల కిందట ఓ మంత్రి మాట్లాడుతూ సదరు పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని హేళళన చేశారన్నారు. అమలు కాని హామీని ఎందుకు ప్రకటించారో కూటమి ప్రభుత్వం చెప్పాలన్నారు. అన్యాయం జరిగితే సహించేది లేదన్న పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉంటున్నారని ఆరోపించారు. పార్టీ శ్రేణులు గ్రామాల్లో వెళ్లి చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనకు నేటి కూటమి ప్రభుత్వానికి మద్య వ్యత్యాసాన్ని వివరించాలన్నారు .ఇక నుంచి నెలకు రెండు సార్లు కొయ్యూరు మండలంలో పర్యటిస్తామన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్బంగా చంద్రబాబు మోసాలపై క్యూఆర్ కోడ్‌తో రూపొంచించిన పోస్టర్‌ను ప్రదర్శించారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ నాయకుడు వి.వెంకటేశ్వర్లు, చింతపల్లి జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ విభాగ కార్యదర్శి జల్లి సుధాకర్, మండల పార్టీ అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్, రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి అచ్యుత్, నాయకులు సూరిబాబు, డల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రేగటి ముసిలినాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షులు నర్సి కృష్ణ, గోకిరి చిన్నారావు, నాయకులు సూరిబాబు, పోతురాజు, పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
బాబు మోసాలు గడప గడపకు వెళ్లి
వివరించాలి
పెదబయలు: చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచారని, కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని అరకు నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పాంగి రామారావు అన్నారు. మండలం కిముడుపల్లి పంచాయతీ మరడాపల్లి గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. నాయకులు చంద్రుబాబు తదితరులు మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు గ్యారంటీ పేరుతో ఇంటింటా బ్యాండ్లు పంపిపెట్టారని తీరా గెలిచిన తరువాత ఏగనామం పెట్టారన్నారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంటింటా బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తే చంద్రబాబు పాలనలో మళ్లి పాత పద్దతిలో డీఆర్ డిపోలకు వచ్చి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. సూపర్ సిక్స్ అమలు ప్రస్తావనే లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, రెడ్‌బుక్ రాక్షసపాలన తప్ప ఎలాంటి అభివృద్ది లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పంచాయతీలో మరడాపల్లి, చీపురుగొంది గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని కోరారు. మర్రి మత్స్యరాజు, నాయకులు టింబ్రునాయుడు, అప్పారావు, వార్డు సభ్యులు యేసుబాబు, కృష్ణారావు, దాసు, త్రినాథ్, శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కూటమి పాలన మోసాల మయం
పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
గ్రామాల్లో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీకి అనూహ్య స్సందన
తరలివచ్చిన గిరిజనం

ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం

ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం