
రెండు బైక్‌లు ఢీ – ముగ్గురికి గాయాలు
జి.మాడుగుల: మండలంలో సోలభం వెళన్లే మార్గంలో శనివారం రెండు బైకులు ఎదురెదుగా వస్తూ ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వంజరి పంచాయతీలో సుర్లపాలెం గ్రామంలో భవనం సెంటరింగ్ పనులు చేస్తున్నారు. వీరు బైక్‌పై జి.మాడుగుల నుంచి సొలభం వైపు శనివారం సాయంత్రం వెళ్తుండగా, పెదలోచలి నుంచి కె.కోడాపల్లి పంచాయతీ బంధవీధి వద్ద చిన సంఘం గ్రామానికి చెందిన పాంగి రాజు, అతని భార్య అనిత, చిన్నారితో బైక్ వస్తుండగా డేగలరాయి జంక్షన్ వద్ద ఎదురెదుగా ఆయా వాహనాలు ఢీ కొన్నాయి. ప్రమాదంలో మేసీ్త్రలు ఇద్దరు గాయపడ్డారు, అలాగే చినసంసంఘం గ్రామానికి చెందిన గిరిజనుడు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారని, ఇందు కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు మత్స్యంనాయుడు, కళ్యాణం, బాలకృష్ణ సహకరించినట్టు స్థానికులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు

రెండు బైక్‌లు ఢీ – ముగ్గురికి గాయాలు