
పోస్టల్ సేవలపై విస్తృత ప్రచారం
ముంచంగిపుట్టు: పోస్టల్ శాఖలో పొదుపు ఖాతాల ప్రయోజనాలను ప్రతి గడపకు తెలియజేసి, విస్తృతంగా ప్రచారం నిర్వహించి, ఖాతాలు తెరిస్తే కలిగే ఆర్థిక భరోసాపై అవగాహన కల్పించాలని అరకు సబ్ డివిజనల్ పోస్టల్ ఐపీవో వి.లక్ష్మీకిషోర్ సిబ్బందికి తెలియజేశారు. ముంచంగిపుట్టు,పెదబయలు మండలాలకు చెందిన బీపీఎంలు, ఏబీపీఎంలతో శనివారం పోస్టల్ సేవలపై గిరిజన గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహణపై ముంచంగిపుట్టు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు సబ్ డివిజన్ ఐపీవో వి.లక్ష్మీకిషోర్ మాట్లాడుతూ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికి వెవెళ్లి పోస్టల్ శాఖలో ఉన్న పొదుపు ఖాతాలపై వివరిస్తూ అవగాహన కల్పించాలన్నారు. ప్రజలంతా నిత్యం అందుబాటులో ఉండే పోస్టాఫీసులను వినియోగించుకొని పోస్టల్ సేవలు పొందేలా పని చేయాలని సూచించారు. ఎస్‌బీ,ఆర్.డి.సుకన్య, ఆర్‌పిఎల్‌ఐ, పిఎల్‌ఐ, బీమా, ఐపిపిబి వంటి ఖాతాలు తెరిస్తే పొందే లబ్ధిని గ్రామస్తులకు తెలియజేయాలన్నారు. ఎంవో శ్రీను, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు ,అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు పాల్గొన్నారు.